Home  »  TV News  »  తన వంటతో దుగ్గిరాల కుటుంబాన్ని మెప్పించిన కావ్య!

Updated : Apr 28, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-81 లో.. అప్పుని బయట ఒక దగ్గర కళ్యాణ్ రహస్యంగా కలిసి మాట్లాడుతుంటాడు. అనవసరంగా చెయ్యని తప్పుకి కావ్య వదిన  శిక్ష  అనుభవిస్తుంది.. ఎలాగైనా మీ స్వప్న అక్క ఎవరితో లేచిపోయిందో కనుక్కోవాలని కళ్యాణ్ అనగానే.. మీ కుటుంబంలో గొడవలు పెట్టె వాళ్లే ఉన్నారనుకున్నాను.. ఇలా కూడా ఆలోచించేవాళ్ళున్నారా అని అప్పు అంటుంది. ఇక కళ్యాణ్ చెప్పిన దానికి అప్పు సరే అంటుంది. ఎలాగైనా స్వప్నని రెచ్చగొట్టేలా మాట్లాడితే తానే వెళ్ళిపోతుందని కళ్యాణ్ ఐడియా ఇస్తాడు.

ఆ తర్వాత వీధిలో కుళాయి దగ్గర ఉన్న వాళ్ళకి.. మా అక్క లేచిపోయి తిరిగి వచ్చింది.. మీరు అటు వైపు వెళ్ళకండి.. ఏం అనకండని వాళ్ళని రెచ్చగొట్టేలే మాట్లాడితుంది అప్పు.. అప్పుడు ఆ వీధీలోని వాళ్ళు మా అక్క దగ్గరికి వెళ్లి తనని రెచ్చగొట్టేల వీళ్ళు ఏదైనా మాట్లాడతారని అనుకుంటుంది అప్పు. ఇక అక్కడున్న వాళ్ళు మనం వెళ్లి స్వప్నని కడిగిపారేద్దామని అంటూ వాళ్ళంతా స్వప్న దగ్గరికి వెళ్తారు. మరొకవైపు కావ్య వంటలు చేసి అన్ని టేబుల్ పై సర్దుతుంది. వంటలు నేను చేశానని చెప్తే అత్తయ్య, రాజ్ తినరు మీరే చేసానని చెప్పండని ధాన్యలక్ష్మితో కావ్య అంటుంది. ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఈ రోజు వంటలు మంచి గుమగుమలు వస్తున్నాయంటూ అందరూ అనుకుంటారు. అలా అన్నం కూర వేసుకొని అపర్ణ మొదటి ముద్ద తింటుండగా.. మొదటి సారి మీ కోడలు వంట చేసింది.. తినండని రుద్రాణి అనగానే.. నోటి కాడి ముద్ద ప్లేట్ లో వేస్తుంది అపర్ణ. ఆ తర్వాత కావ్యని తిడుతుంది అపర్ణ. నిన్ను కిచెన్ లోకి ఎవరు వెళ్లామన్నారు ఒక అత్తగా నీకు ఆర్డర్ వేసినప్పుడు నువ్వు వినాల్సిన అవసరం లేదా అని అపర్ణ అంటుంది. మీరు ఒక అత్తగా ఆర్డర్ వేసా అంటున్నారు అంటే నన్ను కోడలిగా ఒప్పుకుంటున్నట్లేనా అని కావ్య అనగానే.. అపర్ణ కోపంతో అది ఎప్పటికి జరగదని చెప్పేసి అక్కడ నుండి తినకుండానే వెళ్ళిపోతుంది. రాజ్ కూడా వెళ్తుంటే.. రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య వద్దని ఆపుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేసాక.. కావ్య ఒక ప్లేట్ అన్నం తీసుకొని వెళ్ళి రాజ్ వాళ్ళ నాన్నకి ఇచ్చి ఇది బయట నుండి తెప్పించానని చెప్పి అత్తయ్యకి ఇవ్వండని కావ్య అంటుంది.. సరే అని అపర్ణకి వెళ్లి ఇస్తాడు. బయట నుండి తెచ్చానని అనగానే అపర్ణ ఆ అన్నం తింటుంది. 

అపర్ణ అన్నం తిన్న తర్వాత రాజ్ వాళ్ళ నాన్న కావ్య దగ్గరికి వచ్చి.. నా బాధ్యత నాకు గుర్తు చేసావమ్మ అని అంటాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. నా కోడలు బాధ్యత మర్చిపోయినా.. నీ కోడలు బాధ్యత తీసుకుందంటు కావ్యని పొగుడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.